logo

భారత రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మనకొద్దు*మంత్రి పొంగులేటి

తెలంగాణ స్టేట్:: ఖమ్మం జిల్లా:: సత్తుపల్లి నియోజకవర్గం: మే 05

*భారత రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ మనకొద్దు*

- ప్రజా సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ కు పట్టం కట్టండి ,

- సత్తుపల్లి రోడ్ షోలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి,

- సాగునీటి సమస్య రానివం: మంత్రి తుమ్మల

*సత్తుపల్లి:* ఈ లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను మార్చాలనీ బీజేపీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం రాత్రి సత్తుపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లలో ప్రసంగించారు. దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు వర్గాల వారు ప్రమాదంలో పడిపోతారని, అలాంటి సర్కారు మనకొద్దని అన్నారు. ఈ పదేళ్లలో మన రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని తెలిపారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నారు. ఇక కర్ర పట్టుకుని కేసీఆర్ జనం లోకి వస్తున్నారనీ, ఆయనను నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని విమర్శించారు.అక్రమంగా సంపాదించిన లక్షా యాభై వేల కోట్లను దాచుకునేందు కేంద్ర ప్రభుత్వం తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి రఘురాం రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలనీ కోరారు.
*లంకా సాగర్ కు గోదావరి జలాలను తీసుకొస్తాం: మంత్రి తుమ్మల*
స్థానిక లంకాసాగర్ కు గోదావరి జలాలను తీసుకొచ్చి, ఇక్కడి రైతుల వ్యవసాయ భూములకు నిరందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపించి.. ఢిల్లీకి పంపుదామని, జాతీయస్థాయిలో సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు.
బీజేపీ, బీ ఆర్ ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. అందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి.. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం ఎంపీ స్థానానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

169
4343 views